BREAKING: మాజీమంత్రి ఇంటికి పోలీసులు
AP: వైసీపీ నేత, మాజీమంత్రి జోగి రమేశ్ ఇంటికి పోలీసులు వెళ్లారు. నకిలీ మద్యం కేసులో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జోగి రమేశ్‌తో పాటు ఆయన సోదరుడు రాము ఇంటికి కూడా పోలీసులు వెళ్లినట్లు సమాచారం. కాగా, లిక్కర్ కేసులో జోగి రమేశ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.