VIDEO: పోలీస్ వాహనంపై మృతదేహాన్ని కట్టేసి ఆందోళన
NZB: యువకుడి మృతదేహాన్ని పోలీస్ వాహనంపై కట్టేసి ఆందోళనకు దిగిన ఘటన జిల్లా ఏర్గట్ల మండలంలో ఇవాళ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దోంచందా గ్రామానికి చెందిన నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి(29) ప్రేమించి మోసపోయానని మనస్తాపంతో నవంబర్ 6న పురుగుల మందు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందడంతో కుంటుంబ సభ్యులు రోడ్డుపై ధర్నాకు దిగారు.