రైలు ఢీకొని ఒకరు మృతి
VSP: గోపాలపట్నం - విశాఖపట్నం రైల్వే స్టేషన్ మధ్య మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నల్లటి టీషర్ట్, ప్యాంట్ ధరించి ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్లో భద్రపరిచారు. ఎవరైనా గుర్తుపట్టినట్లయితే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.