CMRF చెక్కులు అందజేసిన BRS నాయకులు
BDK: అన్నపురెడ్డిపల్లి మండలంలో ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రి నందు చికిత్స పొందిన నిరుపేదలకు ఇవాళ CMRF చెక్కులు మంజూరయ్యాయి. స్థానిక BRS పార్టీ నాయకులు వేముల హరీష్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా BRS అధ్యక్షులు, MLC తాత మధుసూదన్ సహకారంతో చెక్కులు మంజూరయ్యాయని, వాటిని లబ్ధిదారులకు అందజేసినట్లు పేర్కొన్నారు.