కనిగిరి చరిత్ర గురించి తెలుసా?

ప్రకాశం: కనిగిరి 13వ శతాబ్దంలో కాటంరాజు ఏలుబడిలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆయన కనిగిరి దుర్గాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలించాడు. ఆయన ఏలుబడిలో కడప కర్నూల్ ప్రాంతాలు కూడా ఉన్నట్లు కొన్ని శాసనాల ద్వారా తెలుస్తుంది. ఆయన పాలనలో కనిగిరి ప్రాంతంలో కరువు వల్ల నెల్లూరు పాలకుడైన మనుమసిద్ధి రాజుతో ఒప్పందం చేసుకున్నారని చరిత్ర చెబుతుంది.