ఉద్యోగం పేరుతో భారీ మోసం

NTR: విజయవాడలో ఒంటరిగా ఉంటున్న ఓ వివాహిత దగ్గరి నుంచి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి దంపతులు రామలక్ష్మీ, సాంబశివరావులు రూ. 7లక్షలు వసూలు చేశారు. తర్వాత ఆమె ఓ ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయిందని అపాయింట్‌మెంట్ ఇచ్చారు. రోజులు గడుస్తున్నా.. ఉద్యోగం రాలేదని వారిని నిలదీయడంతో ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీంతో ఆమె వారిపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.