అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను రామగిరి పోలీసులు శనివారం పట్టుకున్నారు. జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన  నిందితులు శనివారం ఉదయం కల్వచర్ల శివారు ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని విచారించగా, పలు దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు.