సుబ్రహ్మణ్యేశ్వరున్ని దర్శంచుకున్న ఇంటిలిజెన్స్ ఐజీ
కృష్ణా: మోపిదేవి గ్రామంలోని స్వయంభు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రాష్ట్ర ఇంటిలిజెన్స్ ఐజీ డీ.రామకృష్ణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా నాగ పుట్టలో పాలు పోసి, మూలవిరాట్‌ను దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత, ఆలయ ఈవో వరప్రసాదరావు ఐజీకి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.