VIDEO: 'ట్రేడ్ లైసెన్సులు తప్పనిసరి'

VIDEO: 'ట్రేడ్ లైసెన్సులు తప్పనిసరి'

నెల్లూరులోని 12వ డివిజన్ ధనలక్ష్మిపురం ప్రాంతంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ సోమవారం పర్యటించారు. స్థానికంగా ఓ అపార్ట్మెంట్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన పట్టణ ప్రణాళిక విభాగం మంజూరు చేసిన అనుమతులను తనిఖీ చేశారు. ప్రతి ఒక్క దుకాణానికి తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ ఉండాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.