'కాటమరాజు మరణం బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం'
NLG: చెన్నగోని కాటమరాజు మరణం బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం అని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం మునుగోడు మండలం కిస్టాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుండె పోటుతో మరణించడం బాధాకరమని అన్నారు. పార్టీకి కాటమరాజు చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ, అతని కుటుంబానికి తాను ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.