'కాలేజీలో 'నో హెల్మెట్ - నో ఎంట్రీ' విధానాన్ని అమలు చేయాలి'

'కాలేజీలో 'నో హెల్మెట్ - నో ఎంట్రీ' విధానాన్ని అమలు చేయాలి'

కోనసీమ: 18 ఏళ్లు నిండిన విద్యార్థులకు డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ ఉంటేనే కాలేజీలోకి అనుమతించాలని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు సోమవారం సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో 60% మంది యువతే ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు బైక్ ఇచ్చే విషయంలో కఠినంగా ఉండాలన్నారు. కాలేజీలు 'నో హెల్మెట్ - నో ఎంట్రీ' విధానాన్ని అమలు చేయాలన్నారు.