మారేడుమాకలో కమ్యూనిటీ హాల్ ప్రారంభం

మారేడుమాకలో కమ్యూనిటీ హాల్ ప్రారంభం

కృష్ణా: కంకిపాడు మండలం మారేడుమాక ఎస్సీ కాలనీలో సుమారు రూ. 20 లక్షల నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. ప్రజల విజ్ఞప్తి మేరకు సామాజిక వర్గ ప్రజలు తమ కుటుంబ, సామూహిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు దీనిని నిర్మించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.