మేళ్లచెరువులో తార స్థాయికి చేరిన ఎండలు ..!!

మేళ్లచెరువులో తార స్థాయికి చేరిన ఎండలు ..!!

SRPT: మేళ్లచెరువులో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. సూపర్ ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు సుమారు 45 డిగ్రీలకు చేరుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరించడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతుండటంతో వీధులన్నీ జనసంచారం లేక నిర్జీవంగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం సమయంలో అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.