యాదవ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడిగా రేవంత్
MLG: జక్కుల రేవంత్ యాదవ్‌ను యాదవ ఐక్య వేదిక ములుగు జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. రాష్ట్ర అధ్యక్షులు గొల్ల అయిలేష్ యాదవ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సంఘాన్ని బలోపేతం చేసి యాదవుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. బీసీ సంక్షేమం, సామాజిక అభివృద్ధికి పనిచేయాలని పేర్కొన్నారు. నియామకంపై నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.