గ్రామపంచాయతీ నామినేషన్ల ప్రక్రియ ఈరోజు ముగింపు
WNP: జిల్లాలోని 5 మండలాలకు సంబంధించిన గ్రామపంచాయతీ నామినేషన్లు ప్రక్రియ ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముగిస్తుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. వార్డ్ మెంబర్‌గా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఉదయం 10:30 నుంచి రిటర్నింగ్ అధికారికి కార్యాలయంలో చేరుకొని తమ నామినేషన్లు దాఖలు చేయాలన్నారు. 5 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా నామినేషన్ స్వీకరించబడవన్నారు.