'ఆడబిడ్డల వివాహానికి ఈ పథకాలు దోహదపడతాయి'
MDCL: కూకట్‌పల్లి నియోజకవర్గం బాలానగర్ మండలం తహసిల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొని లబ్ధిదారులకు 67 చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల వివాహానికి ఈ పథకాలు ఎంతో దోహద పడతాయన్నారు.