హజరత్ సయ్యద్ ఉర్సు ఉత్సవాలు

SRD: హత్నూర మండలం కాసర్ల గ్రామ శివారులోని హజ్రత్ సయ్యద్ హుస్సేన్ 38వ ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని కార్యనిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా 17వ తేదీన సందల్ ముబారక్, గంధం ఊరేగింపు, 18న దీప ఆరాధన, 19న కథ జియారత్ ఫాతిమా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామస్తులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు.