రైతుల సంక్షేమానికి కూటమి కట్టుబడి ఉంది: వాసంశెట్టి
కోనసీమ: అన్నదాతల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూటమి సీనియర్ నేత వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కె.గంగవరంలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ యోజన సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. అన్నదాతల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నియోజకవర్గంలో 24,092 రైతులకు రూ.16.51 కోట్లు ఈ పథకం ద్వారా మంజూరైనట్లు ఆయన పేర్కొన్నారు.