రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
SRCL: దక్షిణ కాశీ వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక సోమవారం ప్రీతికరమైన రోజు కావడంతో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలిరావడంతో ఇసుక వేస్తే రాలదు అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. రాజన్న ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.