ధర్మవరం దర్గా ఉరుసులో చిలకం మధుసూదన్ రెడ్డి
సత్యసాయి: ధర్మవరంలోని సయ్యద్ మెహమూద్ షా ఖాదర్ వలీ దర్గా 99వ ఉరుసే షరీఫ్ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. దర్గా కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆయన హాజరై, స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ సభ్యులకు రూ.10,116 విరాళంగా అందజేశారు.