మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీదే: మంత్రి స్వామి
ప్రకాశం: ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళలు నేడు అంతరిక్ష పరిశోధనల నుంచి దేశ పాలన వరకు ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారని మంత్రి స్వామి ఆదివారం అన్నారు. కొండపిలో పర్యటించిన ఆయన.. మహిళ అమ్మగా, సోదరిగా సృష్టి గమనాన్ని మారుస్తున్నారని తెలిపారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీదేనని పేర్కొన్నారు.