కాళోజీ వర్సిటీలో విజిలెన్స్ తనిఖీలు

కాళోజీ వర్సిటీలో విజిలెన్స్ తనిఖీలు

TG: వరంగల్ కాళోజీ యూనివర్సిటీలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. పీజీ పరీక్షల మార్కుల గోల్‌మాల్‌పై విచారణ చేస్తున్నారు. ఫెయిలైన ఐదుగురు విద్యార్థులు రీవాల్యూయేషన్‌లో పాస్ అయ్యారు. డబ్బులు తీసుకుని పాస్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.