అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంపీపీకి ఘన సన్మానం

సూర్యపేట: తుంగతుర్తి మండల ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్ ను అంతర్జాతీయ మహిళా దినోత్సం సందర్బంగా శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య ఆధ్వర్యంలో నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశం అభివృద్ధి జరుగుతుందని, సహనానికి ప్రతీక మహిళ అని అన్నారు.