అంబులెన్స్‌లో ప్రసవించిన ఓ గిరిజన మహిళ
BDK: బూర్గంపాడు మండలం చింతగుంట గ్రామానికి చెందిన రాజి అనే గర్భిణీ మహిళ పురిటి నొప్పులు అధికం అవ్వడంతో 108 అంబులెన్స్ లోనే ఇవాళ ప్రసవించినట్లు మెడికల్ టెక్నీషియన్ సుభద్ర తెలిపారు. అనంతరం మొరంపల్లి బంజారా PHC లో చేర్చినట్లు తెలిపారు. తల్లి బిడ్డ క్షేమమని వైద్యులు తెలిపారు. రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు.