విద్యుత్ సరఫరాలో అంతరాయం

విద్యుత్ సరఫరాలో అంతరాయం

SRD: పటాన్‌చెరు మండలంలోని పలు కాలనీల్లో శనివారం ఉదయం సాంకేతిక లోపం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచింది. ట్రాన్స్‌ఫార్మర్‌కు సంబంధించిన వైర్ దెబ్బతినడంతో సమస్య ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది మరమ్మతులు ప్రారంభించారు. మధ్యాహ్నంలోగా పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని వారు వెల్లడించారు.