వినుకొండలో రేపు ప్రజా దర్బార్
PLD: వినుకొండ, కొత్తపేటలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజల వినతులను నేరుగా స్వీకరించనున్నట్లు తెలిపారు. సమస్యలు, విజ్ఞప్తులను ప్రత్యక్షంగా తెలియజేయడానికి ఇది మంచి అవకాశం కావడంతో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.