కర్ణాటకలో వ్యవసాయ మార్కెట్ విజ్ఞాన యాత్ర
JGL: పెగడపల్లి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యుల విజ్ఞాన యాత్ర కొనసాగుతుంది. మార్కెట్ కమిటీ ఛైర్మన్ బుర్ర రాములు గౌడ్ ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు గురువారం కర్ణాటకలోని గుల్బర్గా, హుమ్నాబాద్ మార్కెట్లను సందర్శించారు. ఏఎంసీ చైర్మన్ రాములు గౌడ్ మాట్లాడుతూ.. విజ్ఞాన యాత్ర వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు.