రూ.30 లక్షలతో GP భవనం
VKB: దుద్యాల్ మండలం సంట్రాకుంట గ్రామ పంచాయతీకి KADA నిధుల్లో రూ.30 లక్షలతో భవనం మంజూరైంది. మంగళవారం సొంత భవనం నిర్మాణానికి నిధులు మంజూరైనందుకు గ్రామ ప్రజల తరఫున సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఛైర్మన్ రాజేశ్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ST సెల్ అధ్యక్షుడు రవినాయక్, DPT సురేశ్ బాబు, AE సురేందర్ పాల్గొన్నారు.