చెరువులో మృతదేహం లభ్యం

చెరువులో మృతదేహం లభ్యం

MDK: నిజాంపేట గడిమ్ చెరువులో అశోక్ అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో SI రాజేష్ మృతదేహాన్ని బయటకు తీయించి, పోస్టుమార్టం కోసం రామాయంపేట ఆసుపత్రికి తరలించారు. మృతుడు పోచమ్మల గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. ఈ మృతికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.