రేపటి వరకు పన్ను బకాలు చెల్లించాలి: కమిషనర్
MDK: తూప్రాన్ పట్టణ మున్సిపల్ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఇంటి పన్ను బకాయిలను వెంటనే చెల్లించాలని కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి పేర్కొన్నారు. మార్చి 31లోగా పన్నులు చెల్లించి పెనాల్టీలు లేకుండా చూసుకోవాలని కోరారు. పన్ను చెల్లింపులు చేసి 100% పన్నుల బకాయిలు లేని మున్సిపాలిటీగా ఉండేందుకు ప్రజలు సహకరించాలని ఇవాళ వెల్లడించారు.