కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మఠాధిపతి
ADB: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాను శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి స్వామీ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగద్గురు శంకరాచార్యుల చిత్ర పటాన్ని బహుకరించి, ఇటీవల జరిగిన శంకరాచార్యుల జయంతి వివరాలను తెలియజేశారు. ప్రాచీన మఠం విశిష్టత, ప్రత్యేకతను మఠాధిపతి కలెక్టర్‌కు వివరించారు.