ఉంగుటూరులో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన

కృష్ణా: గన్నవరం ఐసీడీఎస్ సీడీపీవో జీ. మంగమ్మ కిశోర బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రతపై శనివారం అవగాహన కల్పించారు. సెప్టెంబర్ 2 నుండి 12 వరకు జరుగే సంకల్ప ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా ఉంగుటూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పీరియడ్స్‌లో శుభ్రత, సరైన ఆహారం, ఐరన్ టాబ్లెట్స్, వ్యాయామం, సమానత్వం, బాల్యవివాహాల నివారణపై సూచనలు చేశారు.