రక్తపు మడుగులో యువకుని మృతదేహం

రక్తపు మడుగులో యువకుని మృతదేహం
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బస్టాండ్‌లో రక్తపు మడుగులో యువకుని మృతదేహం తీవ్ర కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి వేళలో చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.