రేపే శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి గిరి ప్రదక్షిణ
ASF: రెబ్బెన మండలం గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి గిరిప్రదక్షిణ కార్యక్రమం ఆదివారం నిర్వహించనున్నారు. ప్రతి నెల శ్రావణ నక్షత్రం సందర్భంగా జరిగే 16వ గిరి ప్రదక్షిణ జరగనుంది. చిలుకూరు బాలాజీ శివాలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని నిర్వాహకులు కోరారు.