కువైట్‌లో అమెరికా ఎంబసీ మూసివేత

కువైట్‌లో అమెరికా ఎంబసీ మూసివేత

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కువైట్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. నిన్న ఈ కార్యాలయంపై ఇరాన్ డ్రోన్‌లతో దాడి చేయడంతో భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. దౌత్యవేత్తల రక్షణే ప్రాధాన్యతగా కార్యకలాపాలను నిలిపివేసి, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ దాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.