'డయేరియాపై ఆందోళన అవసరం లేదు'

NTR: డయేరియాపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో ప్రతి ఇంటికీ హైజీన్ కిట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆసుపత్రులలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. డయేరియాపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ నంబర్ 9154970454ను సంప్రదించాలని కోరారు.