రేపే తొలి విడత ఎన్నికల పోలింగ్
SRCL: జిల్లాలో తొలి విడత ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఐదు మండలాల్లో 85 సర్పంచ్, 758 వార్డు స్థానాలకు గాను 9 సర్పంచ్, 229 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 76 సర్పంచ్, 519 వార్డు సభ్యుల స్థానాలకు గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.