గజ్వేల్‌లో బంద్.. పోలీసుల మోహరింపు

గజ్వేల్‌లో బంద్.. పోలీసుల మోహరింపు

TG: సిద్ధిపేట జిల్లా గజ్వేల్ బంద్‌కు బీఆర్ఎస్ శ్రేణులు పిలుపునిచ్చాయి. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా ఇవాళ బంద్ చేపట్టారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీల్లో వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రత కల్పిస్తున్నారు.