'ప్రతీ గ్రామం స్వచ్ఛతకు నిలయం కావాలి'
GNTR: ప్రతి గ్రామం స్వచ్ఛతకు నిలయం కావాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. ఇవాళ జిల్లా నీరు, పారిశుధ్య కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పారిశుధ్య నిర్వహణకు పెద్ద పీట వేయాలని, ఎక్కడా బహిరంగ మల విసర్జన లేకుండా చూడాలని తెలిపారు. ఎక్కడైనా వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు అవసరం అనుకుంటే మంజూరుకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు.