రాఘవ్ చద్దాపై ధ్వజమెత్తిన సొంత పార్టీ నేతలు

రాఘవ్ చద్దాపై ధ్వజమెత్తిన సొంత పార్టీ నేతలు

ఆప్‌లో ఎంపీ రాఘవ్ చద్దా, పార్టీ నాయకత్వం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా రాఘవ్‌పై ఢిల్లీ ఆప్ చీఫ్ సౌరభ్ భరద్వాజ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రతిపక్షాలు చేపట్టిన ఏ ఆందోళనల్లోనూ చద్దా పాల్గొనలేదని, అలాగే ప్రధానిని లేదా కేంద్రాన్ని ప్రశ్నించేలా ఆయన ఎప్పుడూ గళమెత్తలేదని విమర్శించారు. భరద్వాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారం రేపుతున్నాయి.