VIDEO: హంస వాహనంపై పార్వతీ పరమేశ్వరులు
CTR: పుంగనూరులోని నగర వీధిలో వెలసిన శ్రీ సోమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ పార్వతీ పరమేశ్వరులు హంస వాహనంపై కొలువుదీరి, పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ మధ్య ఈ ఊరేగింపు సాగింది. అనంతరం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.