AP మోడల్ స్కూల్‌లో ప్రవేశాలు ప్రారంభం

KRNL: పెద్దకడబూరులోని ఏపీ మోడల్ స్కూల్‌లో 6వ తరగతికి సంబంధించిన ప్రవేశం పకడ్బందీ ఏర్పాట్ల మధ్య సోమవారం ప్రారంభమయింది. ఏపీ మోడల్ స్కూల్‌లో 2025 - 2026 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో మొత్తం 80 సీట్లు ఉన్నాయని, వీటికి 271 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా రోస్టర్ పద్దతిలో భర్తీ చేస్తామన్నారు.