కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి

కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి

తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. ఇవాళ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సూర్యారావు(81) అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య 7కి చేరింది. అలాగే మరో 13 మంది కల్తీపాల బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా కల్తీ పాల ఘటన రాష్ట్రంలో సంచలనం రేపిన విషయం తెలిసిందే.