జిల్లాలో 3 DLDO కార్యాలయాలు ప్రారంభం..!
శ్రీకాకుళం (D) 3 DLDO(డివిజనల్ లైబ్రరీ డెవలప్‌మెంట్ ఆఫీసర్) కార్యాలయాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యాలయాల ద్వారా గ్రామ స్థాయిలో సేవలు మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. DLDOగా పదోన్నతి పొందిన అరుంధతి దేవి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యాలయాలు అభివృద్ధి, పరిపాలనను ప్రజలకు చేరువ చేస్తాయని MLA గొండు శంకర్ పేర్కొన్నారు.