తలారి రంగయ్యకు వైఎస్ జగన్ అభినందనలు
ATP: ఆర్డీటీ సంస్థకు FCRA అనుమతులు లభించేలా అలుపెరగని పోరాటం చేసిన మాజీ ఎంపీ, వైసీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్యను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. అనుమతుల పునరుద్ధరణ విషయం తెలుసుకున్న ఆయన వెంటనే రంగయ్యకు ఫోన్ చేసి ప్రత్యేకంగా ప్రశంసించారు. ఢిల్లీ స్థాయిలో గళమెత్తి పేదల పక్షాన నిలబడిన తీరును అభినందించారు.