'విద్యార్థులు ప్రతిరోజు దినపత్రికలు చదవాలి'
MBNR: విద్యార్థులు ప్రతిరోజు దినపత్రికలు చదవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు గ్రంథాలయాలను ఉపయోగించుకుని ఉద్యోగాలు సాధించాలని కాంక్షించారు.