కేంద్రమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

TG: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. NH 765లోని HYD- శ్రీశైలం సెక్షన్‌కు సంబంధించి మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయాలని, HYD-అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేను త్వరగా మంజూరు చేయాలని సీఎం కోరినట్లు సమాచారం. ORR, RRRలను కలుపుతూ రేడియల్ రోడ్ల అభివృద్ధి ఆవశ్యకతను కేంద్రమంత్రికి సీఎం వివరించారు.