VIDEO: పుంగనూరులో ఆకస్మిక రాళ్ల వాన

VIDEO: పుంగనూరులో ఆకస్మిక రాళ్ల వాన

CTR: పుంగనూరు పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆకస్మికంగా రాళ్ల వాన కురిసింది. సుమారు అరగంట పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. పట్టణం, పరిసర గ్రామాల్లో వర్షం ప్రభావం కనిపించింది. రహదారులపై నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.