రావి ఆకుపై పరమశివుడి అద్భుత చిత్రం
VKB: దౌల్తాబాద్ మండలం యాంకి గ్రామానికి చెందిన సూక్ష్మ చిత్రకారుడు సున్నపు అశోక్ మహాశివరాత్రి సందర్భంగా తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన ఎంతో నైపుణ్యంతో రావి ఆకుపై శివుడి రూపాన్ని అద్భుతంగా మలిచారు. అంతే కాకుండా, చింతగింజపై శివలింగాన్ని చెక్కి పరమశివుడి పట్ల తనకున్న భక్తిని వినూత్నంగా చాటుకున్నారు.