గుంత ఎప్పుడు పూడుస్తారూ..?

గుంత ఎప్పుడు పూడుస్తారూ..?

MBNR: గండీడ్ మండలంలో కేబుల్ పనుల నిమిత్తం భారీ గుంతను తవ్వి అలాగే వదిలేయడంతో ప్రమాదకరంగా మారింది. దీంతో ప్రయాణికులు, ద్విచక్రవాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పనులు పూర్తైన అనంతరం పూడ్చివేయాల్సి ఉన్నా.. అలాగే వదిలిపెట్టడంతో రాత్రి వేళల్లో పలువురు కిందపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతను మట్టితో పూడ్చివేయాలని స్థానికులు కోరుతున్నారు.